V6 News

MS Dhoni Security: ప్రధాని మోడీ రేంజ్‌లో ఎంఎస్ ధోనీ సెక్యూరిటీ?

MS Dhoni Security: ప్రధాని మోడీ రేంజ్‌లో ఎంఎస్ ధోనీ సెక్యూరిటీ?

MS Dhoni Security: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు మైదానంలో ఉన్నా లేకపోయినా, ఆయన గురించి వచ్చే ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం ధోనీ భద్రత, ఐపీఎల్ 2026లో అతడి పునరాగమనం గురించి జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

మైఖేల్ వాన్ కామెంట్స్ నిజమేనా?: 

ఎంఎస్ ధోనీకి భారత ప్రధాని నరేంద్ర మోడీ స్థాయి భద్రత ఉంటుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ధోనీకి Y- కేటగిరీ భద్రత మాత్రమే ఉంది. అతడు భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న సమయంలో 'Z' కేటగిరీ భద్రత ఉండేది, కానీ 2014లో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక అది తగ్గిపోయింది. ఇక ప్రధానికి ఉండే SPG (Special Protection Group) భద్రతతో ధోనీ భద్రతను పోల్చలేం. రక్షణ కోసం ధోనీ తన పేరు మీద గన్ లైసెన్స్ కూడా కలిగి ఉన్నారు. 

Also Read ; సంజు శాంసన్ క్లాసీ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్

రాబోయే మ్యాచ్‌లో ధోనీ ఆడతారా?:

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ధోనీ ఆడలేదు.. త్వరలోనే అతడు తిరిగి జట్టులోకి చేరుతాడని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ సమాచారం అందించారు. ధోనీ ప్రస్తుతం రిహాబిలిటేషన్‌ సెంటర్ లో ఉన్నారు. ఆయన ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు.